Header Banner

గుంటూరు జీజీహెచ్‌కు కొమ్మినేని శ్రీనివాసరావు తరలింపు! కృష్ణంరాజు, సాక్షి టీవీ యాజమాన్యంపైనా ఎఫ్ఐఆర్

  Tue Jun 10, 2025 11:39        Politics

అమ‌రావతి మ‌హిళ‌ల‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్ట్, 'సాక్షి టీవీ' యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈరోజు ఉద‌యం వైద్య ప‌రీక్ష‌ల కోసం ఆయ‌న‌ను గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఆయ‌న‌ను మంగ‌ళ‌గిరి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. ఓ చర్చా కార్యక్రమంలో అమరావతి ప్రాంత మహిళలపై ఆయన చేసినట్లుగా ఆరోపించబడుతున్న వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి, నాలుగు రోజుల క్రితం దాఖలైన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది. హైదరాబాద్‌లోని జర్నలిస్ట్స్ కాలనీలో ఉన్న ఆయన నివాసం నుంచి కొమ్మినేని శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి చట్టపరమైన చ‌ర్య‌ల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.

 

ఇది కూడా చదవండి: మరో కొత్త ఫీచర్ను తీసుకురాబోతున్న వాట్సాప్.. ఇక ఫొటోలు, వీడియోల డౌన్లోడ్ కంట్రోల్ మీ చేతుల్లోనే!

 

అమరావతిని "వేశ్యల రాజధాని" అంటూ జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేఎస్ఆర్ లైవ్ షోలో ఆయ‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఈ వ్యాఖ్య‌లను యాంక‌ర్ కొమ్మినేని శ్రీనివాస‌రావు ఖండించ‌క‌పోగా వాటిని కొన‌సాగించేందుకు మ‌రింత ఊత‌మిచ్చారు. ముఖ్యంగా రాజధాని అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన మహిళలను ఈ వ్యాఖ్యలు తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని పలువురు ఖండించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు, 'సాక్షి టీవీ' యాజమాన్యంపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంతో పాటు, భారతీయ న్యాయ‌సంహిత‌లోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఘటన మీడియా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Kommineni Srinivasa Rao #Sakshi TV #Amaravati #Guntur #GGH Journalist #Arrest #AP Police #Krishnam Raju #Kambampati #Sirisha Defamation #SC ST Act